పాల ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు తీసుకోవాలి..


Ens Balu
4
తిరుపతి
2021-02-27 16:27:56

చిత్తూరు జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కవ మంది పశు పోషణ పై ఆధారపడి వారి జీవనాన్ని సాగిస్తున్నారని, కావున పశు సంపద వృద్ధికి సంబంధిత అధికారులు అందరూ సమన్వయం తో పని చేసి జిల్లాలో పాల ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏ పి డెయిరీ మరియు అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు మొదటి విడత లో మదనపల్లె, రామసముద్రం మండలాలలో వంద గ్రామాలలో ప్రారంభించిన కార్యక్రమం మరియు రెండవ విడత లో 170 గ్రామాల్లో పాల సేకరణ కు చర్యలు చేపట్టి, త్వరలో ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి  ద్వారా మహిళలకు ఉపాధి ఏర్పడుతుందని, వ్యవసాయ రంగం తరువాత పశు పోషణ పై ఎక్కువ మంది ఈ జిల్లాలో ఆధారపడి జీవిస్తున్నారని, అందుకు తగిన విధంగా ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పాటు చేసి పాల సేకరణ ను చేసేందుకు చర్యలు చేపడితున్నాదని సూచించారు. ప్రపంచంలో నే అతి పెద్ద పాల ఉత్పత్తులకు సంబంధించిన సంస్థ అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మదనపల్లి, రామసముద్రం మండలాలలో మొదటి విడత వంద గ్రామాలలో పాల సేకరణ ప్రారంభించడం జరిగిందని, రెండవ విడత లో నిమ్మనపల్లి-37, కురబలకోట- 42, వాల్మీకిపురం- 21, రామకుప్పం- 11, వి.కోట -59 మొత్తం 170 గ్రామాలలో త్వరలో ప్రారంభించనున్నట్లు, ఇందుకు అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ప్రధానంగా పాలల్లో ఎస్ ఎన్  ఎఫ్, ఫ్యాట్ పెంచేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల పై పశు సంవర్థక శాఖ అధికారులు మహిళా రైతులకు అవగాహన కల్పించాలని, పాల పరిశ్రమను ప్రోత్సహించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఒక లీటర్ పాలకు రూ.4 ను ప్రోత్సాహకం గా ఇవ్వడం జరుగుతున్నదని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో పాల సేకరణ కు సంబంధించి జిల్లా స్థాయి కోర్ కమిటీ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, మదనపల్లె సబ్ కలెక్టర్, జేసీ లు (రెవిన్యూ, అభివృద్ధి, సంక్షేమం), ఆర్డీఓ లు నోడల్ ఆఫీసర్ లు గా, డి ఆర్ డి ఏ, డ్వామా పిడి లు, పశు సంవర్థక శాఖ జె డి, డి సి ఓ, పంచాయతీ రాజ్ ఎస్ ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ డి లు మెంబర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.        ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ తో పాటు మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, డి ఆర్ డి ఏ, డ్వామా పి డి లు తులసి, చంద్ర శేఖర్ లు, పశు సంవర్థక శాఖ జె డి వెంకట్రావు, డి సి ఓ చంద్ర శేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.