బి.సి గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం..


Ens Balu
11
Srikakulam
2020-08-18 21:12:08

మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బి.సి సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ మరియు అంపోలు (శాస్త్రులు పేట) మహాత్మ జ్యోతిబాపూలే బి.సి సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జల్లు లక్ష్మణ మూర్తి తెలిపా రు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 వి ద్యా సంవత్సరానికి లాటరీ పద్ధతి ద్వారా 5 వ తరగతి (ఇంగ్లీష్ మాధ్యమం) లో ప్రవేశమునకు బాలబాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.  అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ నుండి సెప్టెంబరు 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో  http://apgpcet.apcfss.in/MJPAPBCWR/ వెబ్ సైట్ ద్వారా సమర్పించాలని తెలిపారు. అంపోలు నరసన్నపేట, సంతబొమ్మాళి గురుకులాల్లో బాలురకు., టెక్కలి, శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, పాతపట్నం గురుకులాల్లో బాలికలకు ప్రవేశాలు జరుతాయని చెప్పారు.