విమానాశ్రయ భూసేకరణ పూర్తి చేయాలి..
Ens Balu
2
Bhogapuram
2021-02-27 20:08:52
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణ, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ కరికాల వలెవన్ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం విమానాశ్రయ భూములను, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌తో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ట్రంపెట్ బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణను పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన భూసేకరణ, కోర్టు కేసులు, ఆర్ అండ్ ఆర్ పనులు, భూములను చదునుచేసే కార్యక్రమాలపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సిహెచ్ కిశోర్ కుమార్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్(ఎయిర్‌పోర్స్ట్) రామకృష్ణ, భోగాపురం తాశీల్దార్ బాల రాజేశ్వర్రావు, భూసేకరణ సమన్వయాధికారి జి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.