మనవూరు మనందరి బాధ్యత..


Ens Balu
2
Srikakulam
2021-02-27 20:18:02

చెత్తను ఇంటి వద్దనే విభజించి పారిశుధ్య కార్మికులకు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. బాపూజీ కళామందిర్ లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, క్లీన్ ఆంధ్రా ప్రదేశ్ ప్రోగ్రామ్ కార్యక్రమంను పకడ్బందీగా నిర్వహించడంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిబ్బందితో ముఖాముఖిగా తడి చెత్త, పొడి చెత్త నిర్వాహణ గురించి దృశ్య శ్రవణం ద్వారా సిబ్బందికి వివరించారు. ప్రతీ వీధిలో డస్ట్ బిన్ లో చెత్తను వేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రహదారులు, వీధుల్లో చెత్త లేకుండా చెయ్యాలని పేర్కొన్నారు. ప్రతీ ఇంటి దగ్గర శానిటేషన్ సిబ్బంది  వెళ్ళి చెత్త కలెక్షన్ తప్పనిసరిగా చెయ్యాలని చెప్పారు. పారిశుధ్య సిబ్బంది రావడంలో జాప్యం జరిగినా చెత్త ఎక్కడా వేయకుండా ఇంటి దగ్గర ఉంచాలని సూచించారు. ఎక్కడైతే చేత్త ఉండదో అక్కడ దోమలు, ఈగలు, కుక్కలు, పందులు, ఆవులు, గేదెలు లాంటివి రాకుండా ఉంటాయిని అన్నారు. సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పారిశుద్య సిబ్బంది సమన్వయంతో మన వూరు, మన వాడ, మన వీధి పారిశుధ్య రహితంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. పారిశుధ్య సిబ్బంది నుద్దేశించి కమిషనర్ పల్లి.నల్లనయ్య రచించిన పాటను అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, విశాఖపట్నం రీజినల్ డైరెక్టర్ కె.రమేష్, నగరపాలక సంస్ధ కమీషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు.