మార్చి1న పాసింగ్ అవుట్ పరేడ్..


Ens Balu
2
విశాఖపట్నం
2021-02-28 21:46:48

విశాఖపట్నంలో పౌర రక్షణ వాలంటీర్ల పాసింగ్ పరేడ్ మార్చి 1వ తేదీన జరగనున్నట్లు డిప్యూటీ సివిల్ డిఫెన్స్, ప్రత్యేక ఉప కలెక్టర్ కె. భవాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  పౌర రక్షణలో కనీస శిక్షణలో ఇంత వరకు 220వ బ్యాచ్ కు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ బ్యాచ్ 221వ దని,  ఈ బ్యాచ్ లో 39 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.  ఈ శిక్షణ ఫిబ్రవరి 15వ తేది నుండి మార్చి 1వ తేదీ వరకు పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు.  శాంతిపురం కమ్యూనిటీ హాల్, గురుద్వార జంక్షన్ దగ్గర  పౌర రక్షణ వాలంటీర్ల పాసింగ్ పరేడ్ మార్చి 1వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.