లెక్కింపు కేంద్రాల పరిశీలిన..


Ens Balu
3
Visakhapatnam
2021-02-28 23:06:01

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు జరుగబోయే ఎన్నికలకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను, స్ట్రాంగ్ రూములను అన్ని సౌకర్యాలతో  ఏర్పాట్లు  చేయాలని జివిఎంసి కమిషనర్ మరియు అదనపు ఎన్నికల అథారిటీ నాగలక్ష్మి.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో కలిసి ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ బ్లాకుల్లో జరుగుచున్న ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ బ్లాకు లో 2, 3, 4, 6 జోన్ లకు సంబంధించి ఏర్పాటు చేసిన రిసెప్షన్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను మరియు స్ట్రాంగ్ రూములను పరిశీలించి అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేసారు. ముఖ్యంగా, జోన్ ల వారీగా ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో చేపట్టవలసిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, బార్కేడింగ్ ఏర్పాట్లు చేయడం, స్ట్రాంగ్ రూముల లో క్రిమి సంహారక రసాయనాలు చల్లించడం, కౌంటింగ్ కేంద్రలాలో అవసరమైన కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం, కావలసిన మౌళిక సదుపాయాలను కల్పించడం వంటి పలు కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ ఎన్నికలు ప్రక్రియ సజావుగా జరిపేందుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కేంద్రాల పరిశీలనా కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి. ఆషా జ్యోతి, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, వ్యయ పరిశీలకులు వై. మంగపతి రావు, పర్యవేక్షక ఇంజినీరులు శివప్రసాద రాజు, వేణుగోపాల రావు, వినయ్ కుమార్, శాంసన్ రాజు, రాజా రావు, సంబంధిత జోనల్ కమిషనర్లు, కార్య నిర్వాహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.