డిసెంబరు నాటికి ఆ రూ.350 కోట్లు ఖర్చుచేయాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-08-19 19:47:46

విశాఖ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో డిసెంబర్ నాటికి రూ.350 కోట్లు ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.బుధవారం తన ఛాబర్ లో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేయాలని, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు,  వెల్ నెస్ కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని  ఆదేశించారు. ఇంజనీరింగ్ సిబ్బంది, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఈ పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజువారీ,   ప్రతి వారం ప్రోగ్రెస్ ను  తెలియజేస్తూ ఉండాలన్నారు. నియోజకవర్గం, మండలం వారీగా, డిఈ, ఈఈ ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు.  పనులకు సంబంధించి మంజారి, నిర్మాణ సామగ్రి, మానవ వనరుల సమీకరణ మొదలైనవి ప్రణాళికాయుతంగా అమలు చేసినట్లయితే పనులు వేగంగా పూర్తవుతాయన్నారు.ఈ విషయమై 21వ తేదీన పూర్తి స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్  సూపరింటెండెంట్ ఇంజనీరు  సుధాకర్, డ్వామా పథక సంచాలకులు సందీప్ పాల్గొన్నారు.