చంద్రబాబు నిరసనకు అనుమతిలేదు..
Ens Balu
2
Tirupati
2021-03-01 16:51:52
తిరుపతిలో చంద్రబాబు చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. సోమవారం అనుమతి లేకుండా చంద్రబాబు రావడంతో ఆయనను రేణిగుంట ఎయిర్ పోర్టులో అడ్డుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఎన్నికల నిభందనలను పక్కాగా అమలు చేసే విషయంలో భాగంగానే చంద్రబాబుని అడ్డుకోవడం జరిగిందన్నారు. ఆయన పర్యటనకు అనుమతి లేదనే విషయాన్నిచంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని.. అయినా ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని ఎన్నికల నిభందనలు అనుసరించి ఆయనను అడ్డుకున్నామన్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల నిబంధనల విషయంలో విఘాతం కల్పించకుండా పోలీసులకు సహకరించాలని అర్భన్ ఎస్పీ పేర్కొన్నారు.