ఇన్ని అవార్డులు రావడం చాలా అరుదు..
Ens Balu
4
విజయనగరం
2021-03-02 19:49:59
విజయనగరం జిల్లాకి అతి తక్కువ కాలంలోనే ఇన్ని అవార్డులు రావడం చాలా అరుదని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌ను, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ ప్రశంసించారు. విజయనగరం జిల్లాకి పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్ లో కలెక్టర్ ను అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇదంతా కలెక్టర్ హరి జవహర్‌లాల్ గొప్పదనమని, ఆయన నిజంగా మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని కొనియాడారు. అన్నిరంగాల్లోనూ అవార్డులను సాధించడం విశేషమని పేర్కొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన, కలెక్టర్ ఛాంబర్‌లో ఉన్న అవార్డులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ప్రతీ అవార్డు గురించీ కమిషనర్‌కు, కలెక్టర్ హరి జవహర్ లాల్ వివరించారు. కలెక్టర్ హరి జవహర్‌లాల్ హయాంలో పనిచేయడం తమకు లభించిన గొప్ప అవకాశమని, జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ పేర్కొన్నారు.