బియ్యం వాహనాల రాకను తెలియజేయాలి..


Ens Balu
3
Srikakulam
2021-03-02 19:59:20

బియ్యం పంపిణీ వాహనాల రాకను ముందుగా  తెలియజేయాలని పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ అన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  సమీక్షించారు. కమీషనర్ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త ఫార్మాట్ లో చేపట్టడం జరిగిందని దానిని వివరించాలని సూచించారు. గతంలో పేకేట్ల రూపం నుండి మార్పు చేసి తూనిక వేసి అందించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని పేర్కొన్నారు. గతంలో కొన్ని కెదులలో పేకెట్లను ప్రక్క ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో పెట్టేవారని, తరువాత బయోమెట్రిక్ తీసుకునేవారని చెప్పారు. ప్రస్తుతం అందుకు అవకాశం లేదని వాహనం ఉన్నప్పుడు రేషన్ తీసుకోవాలని తద్వారా కచ్చితంగా లబ్ధిదారులకు చేరుతుందని పేర్కొన్నారు. విధానాన్ని ఎందుకు మార్పు చేసామనేది ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వాలంటీర్లు క్రియాశీలకంగా ఉన్న చోట్ల బాగా జరుగుతుందని అన్నారు. వాలంటీర్లు ముందుగానే వాహనం రాకను తెలియజేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ ను తీసుకోవచ్చని,  పోర్టబిలిటీ ఉందని కమీషనర్ స్పష్టం చేశారు. కొండ ప్రాంతాలు, తదితర ప్రాంతాల్లో వాహనాలను సాధ్యమైనంత దగ్గరగా గ్రామాలకు తీదుకువెళ్లాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో కార్యక్రమం బాగా అమలు జరుగుతుందని చెప్పారు. సక్రమంగా చేస్తే 15 రోజుల్లో సరుకులు అందించడం పూర్తి చేయవచ్చని ఆయన అన్నారు. గ్రామంలో ఉంటూనే వాహనదారులు మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఏప్రిల్1 నుండి అన్ని వాహనాలు ఒకసారి పంపిణీ ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. దుకాణాలు రేషనలైజేషన్ చేయాలని, ఆసక్తి లేని వాహనదారులను మార్చవచ్చని తెలిపారు. ఐటిడిఏ పిఓ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఇంధన ఖర్చు వెయ్యి వరకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు అనుసంధానం కాని 15 గ్రామాలకు దగ్గరా వెళుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీవో లు ఐ. కిశోర్, టివిఎస్ జి  కుమార్, డి.ఎస్.ఓ డి.వి.రమణ, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎన్. నరేంద్ర బాబు, విజిలెన్స్ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.