మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ..
Ens Balu
3
Vizianagaram
2021-03-02 20:56:51
మొక్కలను విస్తారంగా నాటడం వలన పర్యావరణ పరిరక్షణ కు తోడ్పడగలమని జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. మంగళవారం బొండపల్లి మండలం వేండ్రం గ్రామంలో గల భోగి వాని చెరువు దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం కలెక్టర్ ఆధ్వర్యం లో జరిగింది. అనంతరం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ విజయనగరం జిల్లా శాఖ ఆద్యర్వంలో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ క్యాంప్ ను కలెక్టర్ ప్రారంభించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం, చెరువుల్ను సంరక్షించడం,రక్త దానం చేయడం అనే ముఖ్యమైన మూడు అంశాలపై దృష్టి పెట్టి జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రమాదాలకు గురై చావు బతుకుల మధ్య నున్న అనేక మంది బాధితులు రక్తం కోసం ఆసుపత్రులలో అవస్థలు పడుతున్నారని, రక్త దానం వలన ఇలాంటి వారికీ ఎంతో సహాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలను చైతన్యవంతులు చేసి మొక్కలు నాటే కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తున్న గ్రామానికి చెందిన శ్రీ రామదండు యువతను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి జానకిరావు ,డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, నెహ్రు యువ కేంద్ర డిస్ట్రిక్ కో.ఆర్డినేటర్ విక్రమాదిత్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు, ఎం.పి.డి.ఓ త్రివిక్రమ్ రావు, తహశీల్దార్ సీతారామరాజు, ఎం.ఈ.ఓ విమలమ్మ,డా. వెంకటేశ్వరరావు, కాంట్రాక్టర్ శివ రాజు, రిటైర్డ్ టీచర్ విజయలక్ష్మి,హరిత విజయనగరం కో.ఆర్డినేటర్ రామ్మోహన్, సభ్యులు, సాయి సిద్దార్థ విద్యా సంస్థల డైరెక్టర్ శేఖర్, స్కూల్ చైర్మన్ కె.రాజు, స్కూల్ ఉపాద్యాయులు యం వై నాయుడు, సిచ్. యన్. రావు, ఉజ్వల, ఏంజెల్ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు రమేష్ బాబు,సర్పంచ్ కె. శ్రీనివాస్, ఉపాధి హామీ సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.