లైబ్రెరీసెన్స్ లో శ్రీకాంత్‌కు ఏయూ డాక్టరేట్..
Ens Balu
4
Visakhapatnam
2020-08-19 20:41:04
ఆంధ్రవిశ్వవిద్యాలయం గ్రంధాలయ విభాగం పరిశోధక విద్యార్థి టి.శ్రీకాంత్‌కు డాక్టరేట్ లభించింది. విభాగాధిపతి ఆచార్య వి.ధన రాజు పర్యవేక్షణలో ‘ ఏ స్టడీ ఆన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ ఇన్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్- ఆంధ్రాయూనివర్సిటీ ఏరియా’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. బుధవారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను శ్రీకాంత్ స్వీకరించారు. తన పరిశోధనలో భాగంగా శ్రీకాంత్ 30 బిఇడి కళాశాలలు, 30మంది లైబ్రేరియన్‌లు, 240 మంది అధ్యాపకులు, 600 మంది విద్యార్థులనుంచి సమాచారాన్ని సేకరించారు. గ్రంధాలయాలను అధ్యాపకులు, విద్యార్థులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, సద్వినియోగం చేసుకుంటున్నారు అనే అంశాలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను విద్యావిభాగం బిఓఎస్ చైర్మన్ ఆచార్య టి.షారోన్ రాజు, ఏయూ జర్నలిజం అచార్యులు డాక్టర్ చల్లా రామక్రిష్ణ తదితరులు అభినందించారు.