సింహా చలంలో ఆ అధికారి ఈఓగా పనిచేసిన కాలంలో..


Ens Balu
4
Simhachalam
2020-08-19 20:53:51

సింహాచలం దేవస్థానం ఈవోగా ఎం.వెంకటేశ్వరరావు పనిచేసిన కాలంలో జరిగిన అక్రమ తవ్వకాలు, అవినీతి వ్యవహారాలపై విజిలెన్స్‌ విచారణ గురువారం ప్రారంభమైంది. విశాఖ సింహాచలం దేవస్థానం భూములు, ఘాట్​ రోడ్డులో తవ్విన గ్రావెల్ అవినీతిపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. ఆ విభాగం ఏఎస్పీ బి.లక్ష్మీనారాయణ, డీఎస్పీ ఎ.నరసింహమూర్తి నేతృత్వంలో  సర్వే శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ గోపాలరాజు ఆధ్వర్యంలో ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌) సర్వే నిర్వహించారు. ఇక్కడి కొండను ఎంత తవ్వారు? వీటికి అనుమతులున్నాయా.. ఉంటే ఆ మేరకే తవ్వకాలు జరిగాయా? గ్రావెల్‌ను ఎక్కడికి తరలించారు? ఇలా పలు అంశాలు పరిశీలిస్తామని ఏఎస్పీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వీటి ఆధారంగా మిగిలిన అంశాలపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈఓ స్థాయి అధికారిపై విచారణ జగరడంతో ఇతర విభాగాల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరిపై వేటు పడుతుందోనని అంతా బిక్కు బిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు.