మున్సిపల్ ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు..


Ens Balu
3
Visakhapatnam
2021-03-03 18:42:42

మున్సిపల్ ఎన్నికలకు  ఏర్పాట్లు  చురుకుగా  జరుగుతున్నాయని  జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల  అథారిటీ  వి.వినయ్ చంద్ వివరించారు. బుధవారం  ఉదయం  కలెక్టరు  ఆంధ్రాయూనివర్సిటీ    భవనంలో  ఓట్లు లెక్కింపు కేంద్రాల  ఏర్పాట్లను   జి.వి.ఎం.సి కమిషనరు  నాగలక్ష్మి తో  కలసి  పరిశీలించారు.  ఈ సందర్భంగా  కలెక్టరు  జి.వి.ఎం .సి, రెవెన్యూ  అధికారులకు  పలు సూచనలు ఇచ్చారు.  కౌంటింగు ప్రక్రియలో  సిబ్బందికి  ఎటువంటి  సమస్య రాకుండా తగు  ఏర్పాట్లు గావించాలన్నారు.  తదుపరి  కలెక్టరు  మాట్లాడుతూ  జి.వి.ఎం.సి  ఎన్నికలకు  సంబంధించి  మెటీరియల్ ప్రోక్యూర్ మెంటు నుండి కౌంటింగు ప్రక్రియ వరకు  21 యాక్టివిటీస్ ఉంటాయని,  వీటి  కోసం  నోడల్ అధికారులను  నియమించడం జరిగిందన్నారు.  ఎన్నికల  నిర్వహణకు  సంబందించి  అధికారులకు  సిబ్బందికి  శిక్షణ యివ్వడం జరిగిందన్నారు.  బ్యాలెట్ పేపర్ల ప్రింటింగు  ఈ రోజు నుండి  జరుగుతుందన్నారు.  14వ తేదిన  కౌంటింగుకు  ఆంధ్రా యూనివర్సిటీలో  అన్ని ఏర్పాట్లు  జరుగుతున్నాయన్నారు.  98 వార్డులకు  కౌంటింగు  ఒకే  చోట  జరగడం  వల్ల  సౌకర్యంగా  ఉంటుందన్నారు.  మిగిలిన  మునిసి పాలిటీలలో  కూడా  ఒకే చోట  కౌంటింగు కు  ఏర్పాట్లు  గావిస్తున్నారన్నారు.  జిల్లాలో  440 సమస్యాత్మక  ప్రాంతాలలో  పటిష్టంగా  బందోబస్తు ఏర్పాట్లు  గావించడం  జరుగుతోందన్నారు.   ఎన్నికలు  ప్రశాంత  వాతావరణంలో  జరుగడానికి  పూర్తి  స్థాయిలో  ఏర్పాట్లు  గావిస్తున్నామని  స్పష్టం  చేశారు.  పోలింగు  స్టేషన్లలో  అవసరమైన  మౌలిక  సదుపాయాలను  కల్పించడం  జరుగుతుందన్నారు.  ఓటర్లకు  విజ్ఞప్తి :     ఓటర్లందరూ  వారి ఓటు  ఎక్కడవేయాలో  తెలుసుకుని  తప్పక  ఓటు  వేయాలన్నారు.  ఓటర్లందరికి  ఓటింగ్ సమయం, తేదీలను  బల్క్  ఎస్ ఎం ఎస్ ల ద్వారా  తెలియ జేస్తున్నామన్నారు.   11000 మంది  ప్రభుత్వ అధికారులు   సిబ్బంది,  3- 4 వేల  పోలీసు సిబ్బంది  ఎన్నికల  విధులలో  పాల్గొంటారన్నారు.   కోవిడ్ టీకా  వేసుకున్న వారు  30 ని. ల  విశ్రాంతి  తీసుకున్న తదుపరి  ఓటింగు  కు వెళ్ల వచ్చని  తెలిపారు.