ఏప్రిల్ నుండి రెండవదశ నాడు- నేడు


Ens Balu
4
Vizianagaram
2021-03-03 19:07:27

మొదటి దశలో  ప్రారంబించిన  నాడు-నేడు పనులన్నిటిని ఈ నెలాఖరునాటికి పూర్తి చేసుకోవాలని  ప్రాధమిక విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  బి. రాజశేఖర్  తెలిపారు.  రెండవ దశ పనులు  సుమారు 4 వేల 400 కోట్ల తో  ఏప్రిల్ నెల నుండి ప్రారంభించనున్నామని అయన తెలిపారు.   బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరం లో నాడు –నేడు పనుల పై ఇంజినీర్లు,  మండల విద్యా  శాఖాధికారులతో  సమీక్షించారు.  నాడు –నేడు పనులతో పాఠశాలలు  దేవాలయాలుగా  మారనున్నాయని, ఈ పనులు నాణ్యమైనవిగా, పది కాలాలు  శాశ్వతంగా నిలిచేలా ఉండాలని  అన్నారు.   పిల్లలకు  ప్రశాంత వాతావరణం లో విద్యాభాసం జరిగేలా,  5వ తరగతి వరకు ఆహ్లాదాన్ని అందించేలా, 10వ తరగతి  వరకు పిల్లలకు నాలెడ్జ్ కలిగేలా తీర్చి దిద్దాలని అన్నారు.  నాడు  బ్లాక్ బోర్డ్ లు ఉండేవని, అవన్నీ నేడు గ్రీన్ బోర్డ్ లుగా మారిపోయాయని, భవిష్యతు లో వైట్ బోర్డు  లుగా మారాలని అన్నారు.  క్షేత్ర పర్యటన లో సందర్శించిన కొన్ని పాఠ శాలలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని మోడల్ గా తీసుకోవాలని అన్నారు. మొదటి దశ  లో కొన్ని చోట్ల కాంట్రాక్టర్లతో పని చేయించారని, అయతే రెండవ దశ లో మాత్రం పూర్తిగా ప్రజల భాగస్వామ్యం తోనే జరగాలని సూచించారు.  స్థానిక ప్రజల భాగస్వామ్యం వలన వారికీ స్వంతం అనే భావన కలుగుతుందని,  అందువల్ల ఉత్తమ  నాణ్యత ప్రమాణాలే  కాకుండా నిర్వహణా బాధ్యతను కుడా వారే  తీసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేసారు.  మొదటి దశ లోని  ఉత్తమ అభ్యాసాలను, అనుభవాలను జోడించి స్టాండర్డ్  ఆపరేటివ్ ప్రొసీజర్ ను తయారు చేసి  అమలు జరపడం ద్వారా మంచి  ఫలితాలను సాధించాలని అన్నారు.  మొదటి దశ పనులకు సంబంధించిన మెటీరియల్ అంతా  సెంట్రల్ ప్రోక్యుర్మేంట్ ద్వారా  కంపెనీల  నుంచి నేరుగా తీసుకోవడం వలన  తక్కువ ధరకే నాణ్యమైన మెటీరియల్  ను  వారంటీ తో తీసుకోవడం జరిగిందని అన్నారు.  వారంటీ లోపల ఎలాంటి మరమ్మతులైన, నిర్వహణ పరమైన ఖర్చులైనా కంపెనీలే భరిస్తాయని స్పష్టం చేసారు.           విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, జగనన్న వసతి దీవెన, విద్యా  దీవెన,  గోరు ముద్ద తదితర పధకాల తో  పాటు పిల్లలకు నాణ్యమైన బూట్లు,  యునిఫారాలు, పుస్తకాలు ఉచితంగా అందిస్తోందని అన్నారు.  విద్య కోసం ఖర్చు చేసే నిధులను ఖర్చు గా ప్రభుత్వం భావించడం లేదని, పెట్టుబడి గా భావిస్తోందని అన్నారు.  అప్పుడే మంచి ఫలితాలను చూడగలమని,  అందుకు తగ్గట్టుగానే విద్యా  వ్యవస్థ లో అనేక సంస్కరణలను తేవడం జరిగిందని అన్నారు.  విద్యార్ధులు  పాఠ శాల ఆవరణ లో , తరగతి గదుల్లో  సౌఖ్యంగా ఉండేలా చూడాలని అన్నారు. టాయిలెట్లు  నాడు- నేడు  డిజైన్ ప్రకారంగానే నిర్మించాలని, గాలి, వెలుతురూ, నీరు ఉండాలని అన్నారు. నేడు లో ప్రతి పాఠశాలకు ఒక స్టోర్ రూమ్ ఉండాలని, పాత  మెటీరియల్ అంత అందులో పడేసి,  నేడు అనేది స్పష్టంగా కనపడేలా పాఠశాలలు  రూపు రేఖల్ని  మార్చాలని అన్నారు.           గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతి లాల్ దండె మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న నాడు-డు పనులు, నిధులు పై అరా తీసారు.   గిరిజన పాఠ శాలను కుడా ఆహ్లాదంగా తీర్చి దిద్దాలని, ప్రత్యెక సదుపాయాలను కల్పించాలని అన్నారు.          ప్రాధమిక విద్యా  సలహాదారు మురళి మాట్లాడుతూ నాడు- నేడు పనులలో ఎక్కువగా వచ్చే సాంకేతిక సమస్యలు, చెల్లింపులు  పై వివరించారు.  రెండవ దశ పనుల్లో సచివాలయాల ఇంజినీరింగ్ సహాయకులు ప్రముఖ పాత్ర వహించేలా ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.  ఎం. బుక్ తప్పని సరిగా రాయాలని, ఈ నెలాఖరు నాటికీ మొదటి దశ పనులు, నిధులు, ఎం.బుక్ తదితర పనులను  పూర్తి చేయాలనీ అన్నారు.                 తొలుత జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ జిల్లాలో చేపడుతున్న నాడు – నేడు పనులపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు.  విద్యల నగరంగా విజయనగరాన్ని మార్చడానికి అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ కు ప్రత్యెక అభినందనలు:           విజయనగరం జిల్లాకు సంవత్సరం క్రితం వచ్చానని,  నాటికీ నేటికి ఎంతో తేడా కనపడుతోందని, కలెక్టర్ హరి జవహర్ లాల్ మార్క్ స్పష్టంగా చూశానని  రాజశేఖర్  అన్నారు. ఎక్కడ చుసినా  పచ్చదనంతో ,  నగరం లో సుందరీకరణ  ఎంతో మారిపోయిందని  అన్నారు.  అనేక పాఠ శాలలు  కుడా నూతన రూపాన్ని సంతరించుకొని అందంగా ఉన్నాయని,  మంచి నాయకుడు ఉంటె అద్భుతాలను చేయవచ్చని రుజువు చేసారన్నారు.  కలెక్టర్  కృషికి  ప్రత్యేక  అభినలను తెలిపారు.           ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్, ఐ.టి.డి.ఎ పి.ఓ ఆర్. కూర్మనాద్, , సబ్ కల క్టర్ విధే ఖరే, సర్వ శిక్ష అభియాన్  రాష్ట్ర అధికారులు, జిల్లా విద్య శాఖాధికారి నాగమణి, ఎస్.ఎస్.ఎ పి.ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.