7న మహిళా జర్నలిస్టులకు సత్కారం..
Ens Balu
2
DABA GARDENS
2021-03-04 13:44:02
వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకులను ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు,సొడిశెట్టి దుర్గారావులు తెలిపారు. గురువారం డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కార్యవర్గం చర్చించి, అనంతరం కమిటీ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళా జర్నలిస్టులను,ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ను కూడా సత్కరించనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం ప్రెస్‌క్లబ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ప్రముఖలతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను జర్నలిస్టు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్,టి.నానాజీ.జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్,కార్యవర్గ సభ్యులు శేఖర్‌మంత్రి తదితరులు పాల్గొన్నారు.