విజయనగరం మున్సిపల్ బరిలో 473 మంది..


Ens Balu
2
Vizianagaram
2021-03-04 15:11:07

విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు  అనంత‌రం,  ఏక‌గ్రీవాలు మిన‌హా 473 మంది బ‌రిలో నిలిచారు. బొబ్బిలిలో 80 మంది, సాలూరులో 73 మంది, నెల్లిమ‌ర్ల‌లో 50 మంది, పార్వ‌తీపురంలో 82 మంది, అత్య‌ధికంగా విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ నుంచి 189 మంది పోటీ చేస్తున్నారు. పార్వ‌తీపురంలో 6, బొబ్బిలిలో ఒక‌టి, మొత్తం 7 వార్డులు ఏక‌గ్రీవం అయ్యాయి. నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయితీ ః నెల్లిమ‌ర్ల‌లోని 20 వార్డుల‌కు గానూ మొత్తం 50 మంది పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 20 మంది, టిడిపి నుంచి 20, కాంగ్రెస్ నుంచి 4, జ‌న‌సేన నుంచి 1, బిజెపి నుంచి 1, స్వ‌తంత్రులు 4గురు పోటీ చేస్తున్నారు. బొబ్బిలి మున్సిపాల్టీ ః బొబ్బిలిలో 31 వార్డులు ఉన్నాయి. వీటిలో 11వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి సాహూ వెంక‌ట ముర‌ళీకృష్ణారావు దాఖ‌లు చేసిన నామినేష‌న్ మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో, ఈ వార్డు ఏక‌గ్రీవం అయ్యింది. మిగిలిన 30 వార్డుల్లో 79 మంది పోటీ ప‌డుతున్నారు. వైకాపా నుంచి 30 మంది, టిడిపి నుంచి 28, జ‌న‌సేన నుంచి 6, కాంగ్రెస్ నుంచి 2, సిపిఎం నుంచి 1, సిపిఐ నుంచి 2, బిజెపి నుంచి 1, స్వ‌తంత్రులు 9 మంది పోటీ చేస్తున్నారు. సాలూరు మున్సిపాల్టీ ః సాలూరులో  29 వార్డుల‌కు మొత్తం 73 మంది బ‌రిలో నిలిచారు. వైకాపా నుంచి 28 మంది, టిడిపి నుంచి 27, బిజెపి నుంచి 4, సిపిఎం నుంచి 2, కాంగ్రెస్ నుంచి 1, స్వ‌తంత్రులు 11 మంది పోటీ చేస్తున్నారు. పార్వ‌తీపురం మున్సిపాల్టీ ః  పార్వ‌తీపురం మున్సిపాల్టీలో మొత్తం 30 వార్డుల‌కు 88 మంది పోటీ చేస్తున్నారు. వీటిలో 6 వార్డుల్లో ఒకేఒక నామినేష‌న్ మిగిల‌డంతో ఏక‌గ్రీవం అయ్యాయి. 10 వార్డు నుంచి జ‌లుమూరి దివ్య‌, 15 వార్డు నుంచి చీటి అనురాధ‌, 19 వార్డు నుంచి తెలుగు బోద‌య్య‌, 26వ వార్డు నుంచి బెల‌గాన క‌రుణ‌, 27 వార్డు నుంచి ఇందుకూరి గుణ్ణేశ్వర్రావు, 29 వార్డు నుంచి య‌డ్ల త్రినాధ ఏక‌గ్రీవంగా గెలుపొందారు. మిగిలిన 24 వార్డుల‌కు 82 మంది పోటీ చేస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ః విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 50 డివిజ‌న్లు ఉన్నాయి. ఈ డివిజ‌న్ల నుంచి మొత్తం 189 మంది పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్-50 మంది, టిడిపి-50 , బిజెపి-18 , కాంగ్రెస్‌-16 , జ‌న‌సేన‌-12 , సిపిఎం-1 , బిఎస్‌పి-4 , స్వ‌తంత్రులు- 38 మంది పోటీ చేస్తున్నారు.