పటిష్టంగా కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు..
Ens Balu
3
Visakhapatnam
2021-03-04 22:20:54
జీవిఎంసీ ఎన్నికల అనంతరం కౌంటింగ్ కు చేస్తున్న ఏర్పాట్లలో ఏ విధమైన లోపాలు ఉండరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి వినయ్ జివిఎంసి అధికారులను ఆదేశించారు. మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి తో కలసి ఆంధ్రా యూనివర్సిటీలోని వివిధ భవనాలను ఆయన గురువారం పరిశీలించారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగుకు అవసరమైన మెటీరియల్ అక్కడే పంపిణీ చేస్తారని, వచ్చే వాహనాలకు సరిపడ పార్కింగ్, పోలింగు సిబ్బందికి అవసరమైన వసతులపై ఆయన జివిఎంసి అధికారులతో చర్చించారు. కౌంటింగ్ కేంద్రాలు వద్ద తాగునీరు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, జివిఎంసి చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వరరావు, ఎస్. ఇ. వేణుగోపాల్ రావు రవాణా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.