గ్రామీణ ప్రాంతాల్లో 6 నుంచి సరఫరా..


Ens Balu
3
Kakinada
2021-03-04 22:38:24

మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంత కార్డుదారులకు మార్చి నెల రేషన్ల పంపిణీ ప్రక్రియ 6వ తేదీ శనివారం నుండి ప్రారంభమౌతుందని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలియజేశారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీ గురువారం సాయంత్రంతో ముగించి, మిగిలి పోయిన కార్డుదారులకు మరల ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకూ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.  పట్టన ప్రాంతాల్లో మార్చి నెల రేషన్ పంపిణి ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందన్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ ను ఏ కారణం చేతనైనా తీసుకోని గ్రామీణ, పట్టన ప్రాంతాల కార్డుదారులు, ఫిబ్రవరి, మార్చి  రెండు నెలల రేషన్ లను కార్డుదారు ఒకేసారి వేలిముద్ర వేయటం ద్వారా పొందే అవకాశాన్ని ఈ నెల 10వ తేదీ వరకూ కల్పిస్తున్నామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.   ఈ అవకాశాన్ని పట్టన ప్రాంత కార్డుదారులు ఈ నెల 5వ తేదీ నుండి,  గ్రామీణ ప్రాంత కార్డుదారులు ఈ నెల 6వ తేదీ నుండి వినియోగించుకోవచ్చునని, నెలవారీగా, సరుకు వారీగా కార్డుదారులకు రశీదు ఇస్తారని ఆయన తెలిపారు.