ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతం చేయండి..


Ens Balu
2
Vizianagaram
2021-03-04 22:44:49

 తారకరామా తీర్ధ సాగర్  ప్రాజెక్ట్  నిర్మాణానికి అవసరమగు ఇసుక కోసం సంయుక్త కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్  దృష్టి పెట్టారు.  గురువారం ఆయన డెంకాడ మండలం చొల్లంగి పేట వద్ద నున్న ఇసుక రీచ్ ను పరిశీలించారు. ఈ రీచ్ నుండి ఇసుకను ప్రాజెక్ట్ కోసం తరలించడం లో  సాధ్యాల పై చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.  అనంతరం డెంకా డ  ఆనకట్ట వద్ద డీ సిల్టింగ్  చేయడానికి పరిశీలించారు. ప్రతి వారం ఇరిగేషన్ ప్రాజెక్టుల పై ప్రభుత్వం సమీక్షిస్తోందని, ప్రోజెక్టుల పూర్తికి కావలసిన భూ సేకరణ ఇప్పటికే పూర్తయిందని, మిగిలిన  ఏర్పాట్లన్నీ త్వరలో పూర్తి చేసి  వేగంగా ప్రాజెక్టులు అయ్యేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని జె.సి  అన్నారు. జె.సి వెంట ఇరిగేషన్ ఈఈ  పరమేశ్వర రావు, డి ఈ రమణ, గనుల శాఖ ఏ.డి, తసీల్దార్   తదితరులు ఉన్నారు.