పక్కాగా కౌంటింగ్ కి ఏర్పాట్లు చేయాలి..


Ens Balu
2
Srikakulam
2021-03-05 17:32:20

మునిసిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్  అన్నారు. ఓటును పక్కాగా పరిశీలించాలని ఆయన స్పష్టం చేసారు. మునిసిపల్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ నివాస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెల్లుబాటు అయ్యే ఓటు, చెల్లు బాటు కానీ ఓట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ చెప్పారు.  స్వస్తిక్ గుర్తు ఉన్నవాటిని మాత్రమే సరైనదిగా గుర్తించాలని, నిశాని ఉంటే చెల్లుబాటు కాదని వివరించారు. స్వస్తిక్ గుర్తు సంబంధిత అభ్యర్థి విభాగంలో పక్కాగా ఉండాలని అన్నారు. కౌంటింగ్ కు ముందు ఓట్లు విభజన చేసేటపుడు ఏజెంట్లకు చూపించాలని సూచించారు. ఒక్క ఓటు తేడా ఉన్నప్పుడు మాత్రమే అవసరమైతే ఓట్లను రీ కౌంటింగ్ మాత్రమే చేయాలని సూచించారు. ఒక్కసారి మాత్రమే రీ కౌంటింగ్ చేయాలని అన్నారు. మొదటి సారి కౌంటింగ్ పక్కాగా జరగాలని సూచించారు. బాలట్ లను భద్రపరచాలని ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా కౌంటింగ్ చేయాలని సూచించారు. ఎన్నికల శిక్షణ అధికారి పి.రజనీకాంత రావు కౌంటింగ్ నిర్వహించు విధానం, పాటించాల్సిన విధి విధానాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ కలెక్టర్ మరియు ఎన్నికల శిక్షణా సమన్వయ అధికారి బి.శాంతి, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, కౌంటింగ్ అధికారులు పాల్గొన్నారు.