చెత్తవాహనాలకే చెత్తను అందించాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-03-05 20:00:04

జివిఎంసీ పరిధిలోని ప్రతీ ఒక్కరూ ఇంటింటికీ వచ్చే చెత్త వాహనాలకే చెత్తను అందించాలని కమిషనర్ ఎస్.నాగలక్ష్మి నగర వాసులను కోరారు.  శుక్రవారం  5వ జోన్ లో గల 41వ వార్డు సుబ్బలక్ష్మి నగర్, 42వ వార్డు రైల్వే న్యూకోలనీ, 44వ వార్డు రామచంద్ర నగర్ మొదలగు ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాలోని ప్రజలతో ముచ్చటిస్తూ, పారిశుధ్య కార్మీకులు పనితీరు, ఇంటినుండి చెత్తను వేరుచేసి తీసుకెళ్లడం మొదలగు కార్యకలాపాలను ప్రజలను అడిగితెలుసుకోన్నారు. చెత్తలను రోడ్డు ప్రక్కన వేయకుండా వాహనాలకు అందించాలని ప్రజలకు సూచించారు. మధ్యాహ్నం సమయంలో కాలువల పూడికలు తీయుట, రోడ్లు ఊడ్చు కార్యక్రమము చేపట్టాలని ఎ.ఎం.ఓ.హెచ్.ను ఆదేశించారు. మహిళా సభ్యులు వారి గృహాల వద్ద తడి చెత్త నుండి ఎరువును వేరుచేసి వ్యక్తిగతంగా ఉపయోగించుకొనే హోమ్ కంపోస్టు విధానాన్ని  స్వయంగా పరిశీలించారు. సుబ్బలక్ష్మి నగర్లో గల ప్రజా సౌచాలయాన్ని పరిశీలించి, ప్రతీ రోజు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని కేర్  టేకర్ ను ఆదేశించారు. మలేరియా సిబ్బందితో మాట్లాడుతూ కాలువల్లో  స్ప్రేయింగు చేయడం, దోమల నివారణ చర్యల పై ప్రజలకు తగు అవగాహన నిరంతరం కల్పించడం వంటివి చేయాలని మలేరియా ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో జోన్-5 కమిషనర్ సింహాచలం, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసరు రాజేష్,  కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు, జోన్-5 శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్ స్పెక్టర్, మలేరియా ఇన్ స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.