పోలింగ్ కేంద్రాలను ఈవిధంగా తెలుసుకోండి..


Ens Balu
2
Visakhapatnam
2021-03-05 20:37:38

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు మార్చి 10వ తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ప్రాంతాలును తెలుసుకునేందుకు గాను జివిఎంసి అంతర్జాలంలో తగు ఏర్పాట్లు చేపట్టిందని కమిషనర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం జీవిఎంసీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలు, ఈ ఏర్పాట్లకు సంబంధించి www.gvmc.gov.in/wss/ వెబ్సైటు ద్వారా వివరాలు తెలుసుకోవచ్చనన్నారు. అందులో “Voter Search” ను క్లిక్ చేసి, “Voter Epic” నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత, ఓటర్ పేరు, వార్డ్ నెంబర్ క్లిక్ చేసిన తరువాత, ఓటర్ కు కావలసిన పోలింగ్ స్టేషన్ పేరు మరియు సూచిస్తున్న మ్యాప్ వివరాలు గూగుల్ ద్వారా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.  ఓటు హక్కు దారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, జివిఎంసికి జరుగబోయే  ఎన్నికలలో వారి పోలింగు స్టేషన్ ను తెలుసుకొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కొనవలసినదిగా జివిఎంసి కమిషనర్ , అదనపు ఎన్నికల అథారిటీ  ఓటర్లను అభ్యర్థించారు.