హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనస్వాగతం..


Ens Balu
2
Rajahmundry
2021-03-07 15:50:17

ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ అరుప్‌ ‌కుమార్‌ ‌గోస్వామి, హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్‌లు  ఆదివారం జిల్లాకు విచ్చేసిన సందర్బంగా వారికి ఆర్అండ్బీ అతిధి గృహములో జిల్లా కలెక్టరు డి. మురళీధర్‌ ‌రెడ్డి ,జిల్లా ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం ‌బబిత స్దానిక సబ్‌ ‌కలెక్టరు అనుపమ అంజలి జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. హైకోర్డు ప్రదాన న్యాయమూర్తి మరియు హైకోర్డు న్యాయమూర్తులు శనివారం విజయనగరంలో ఇటీవల కాలములో సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపధ్యములో  ప్రత్యేక మహిళా కోర్టుల ఏర్పాటు ద్వారా న్యాయ వ్యవస్దను పటిష్టం చేసేందుకు ప్రత్యేక న్యాయ స్దానాలు దోహదపడ్తాయని,  ఆదిశగా లైంగిక వేదింపులు చట్టం-2012, పోక్సోచట్టం అమలు ద్వారా  సత్వర న్యాయం అందించేందుకు  ప్రత్యేక మహిళ కోర్డులను ప్రారంబించి తిరుగు ప్రయాణంలో విజయనగరం నుంచి విజయవాడ మార్గమధ్యంలో రాజమహేంద్రవరం స్దానిక రహదారులు భవనాల శాఖ అతిధి గృహము నందు ఆదివారం మధ్యాహ్నాం బోజన విరామం అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మరలా విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో స్దానిక  సహాయ   సూపరింటెండెంటు ఆప్‌ ‌పోలీసు లా అండ్‌ ఆర్డరు  లతా మాదురి, పలువురు న్యాయమూర్తులు  జిల్లా న్యాయ సేవాధికారి సంస్ద కార్యదర్శి  కెవిఎల్‌ ‌హిమబిందు స్దానిక అర్భన్‌ ‌తాహసిల్దారు  కె సుస్వాగత•ం సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.