ప్రమాదాలపై అవగాహన ఎంతో అవసరం..
Ens Balu
3
Chittoor
2021-03-08 14:05:09
ప్రమాదాలు అనేవి పరిశ్రమలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పరిసరాల్లో ఉన్న వారికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిమీద ఉందని అటువంటి ప్రమాదాలను గురించి విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అన్నారు. 50 వ జాతీయ భద్రతా వారోత్సవాలను చిత్తూరులోని ప్రభుత్వ ఐటిఐ సంస్థలో సి పి ఎఫ్ కోళ్ల దానా పరిశ్రమ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భోపాల్ దుర్ఘటన 1972 లో జరిగిందని దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికీ ఆ కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి నెలకొని ఉందని అటువంటి దుర్ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఈ భద్రతా వారోత్సవాలు యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఐటిఐ లో చదివే విద్యార్థులు ప్రధానంగా పారిశ్రామిక సంస్థలు క్షేత్ర స్థాయి ఉద్యోగాలు ఎక్కువగా చేయడం జరుగుతుందని వారిలో మొదట అవగాహన కల్పిస్తే బాగుంటుందని అందుకే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అంతేకాకుండా ప్రతి ఒక్కరూ విద్యతో పాటు నైపుణ్యానికి సంబంధించిన ఏదో ఒక ప్రత్యేక విద్యను నేర్చుకోవటం జరుగుతుందని ఆ తర్వాత ఎక్కడ ఉద్యోగం చేసినా నా ఈ ప్రమాదాలకు సంబంధించి తెలిసి ఉంటే కొంతవరకు తీవ్రతను తగ్గించవచ్చు నని అన్నారు. భావి భారత పౌరులు అయినా విద్యార్థులలో భద్రత గురించి అవగాహన కల్పిస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం తోపాటు సామాజిక పరంగా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివ కుమార్ రెడ్డి ఇ మాట్లాడుతూ ఫ్యాక్టరీలలో జరిగే ప్రమాదాలలో ఎక్కువమంది కేంద్ర స్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడడం జరుగుతుందని మొట్టమొదటి వారే ప్రమాదానికి గురికావడం జరుగుతుందని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని విద్యార్థులలో అవగాహన కల్పించడం వల్ల రాబోవు కాలంలో ప్రధానంగా ఐటిఐ చదివే విద్యార్థులు ఫ్యాక్టరీ లో చేరిన తర్వాత ఇబ్బందులు పడకుండా చూసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. భద్రత గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల లో గత రెండు సంవత్సరాలుగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని వారిలో అవగాహన కల్పించేందుకు వ్యాస రచన వకృత్వ డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం నుంచి కరోనా ప్రభావంతో ఎక్కడ నిర్వహించలేదని నేటి నుంచి తిరిగి ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా మొదలుపెడతామని అన్నారు. ఈ సందర్భంగా ఐటిఐ సంస్థలలో నిర్వహించిన వ్యాస రచన వకృత్వ డ్రాయింగ్ పోటీలలో విజేతలకు బహుమతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కల్నల్ కిరణ్ రెడ్డి, ఐటిఐ విద్యాసంస్థల కోఆర్డినేటర్ గణేష్, చిత్తూరు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి విద్యార్థులు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.