కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవాలి..
Ens Balu
2
Srikakulam
2021-03-08 14:18:45
కుటుంబ ఆరోగ్యం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగులకు ప్రత్యేక మెగా వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేసింది. ఈ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పురుషులు మాత్రమే కాకుండా మహిళల ఆరోగ్యం కూడా అత్యావశ్యమన్నారు. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తరచూ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించడం వలన ఆరోగ్య సమస్యలు ఉంటే తెలుస్తాయని సూచించారు. జెమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కుటుంబ సభ్యులందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటి నివారణకు అవసరమగు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం అని అన్నారు. వైద్య శిబిరంలో ఇసిజి, 2డి ఎకో, బీపీ, షుగర్, పేప్స్మియిర్, బోన్ మినరల్ డెన్సిటీ, కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్లు సుమీత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, డిఆర్ఓ బి.దయానిది, జెమ్స్ వైద్యులు డా.కె.సుధీర్, డా.డి ప్రవీణ్ , జెమ్స్ మేనేజర్లు పెదబాబు, రామ్మోహన్, రెవిన్యూ, పంచాయతీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, ఇతరులు శిబిరంలో పాల్గొని వివిధ వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.