గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..


Ens Balu
3
Paderu
2020-08-20 18:29:28

భూమిలేని నిరుపేద గిరిజనులను గుర్తించి ప్రతీ గిరిజన కుటుంబానికి కనీసం రెండు ఎకరాలకు అటవీ హక్కుపత్రాలు అందించాలని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌దండే స్పష్టం చేసారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతీ గిరిజన కుటుంబానికి కనీసం రెండు ఎకరాలకు హక్కుపత్రాలు పంపినీ చేయాలని ఆదేశించారన్నారు. గురువారం ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తాహశీల్దారులతో విజయవాడ నుంచి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31 వతేదీలో భూమిలేని గిరిజన కుటుంబాల సర్వే పూర్తి చేయాలని సూచించారు. అర్హులను గుర్తించి జిల్లా స్దాయి కమిటీ ఆమోదం పొందాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జి.కె. వీధి మండలంలో రెండురోజులు పర్యటించి వి ఎస్ ఎస్ భూములను పరిశీలించారని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ బాషా మాట్లాడుతూ గిరిజనుల సాగులో ఉన్న భూములకు వచ్చే అక్టోబరు 2 వతేదీన పట్టాలు పంపిణీ చేయడానికి సిద్దం కావాలన్నారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు హద్దులునిర్ధేశించి హద్దు రాళ్లను వేసి సంబందిత లబ్దిదారుడిని ఆ భూమిలో నిలబెట్టి పోటో తీసి వెబ్‌సెట్‌లో నమోదు చేయాలని చెప్పారు. భములు సర్వే చేసి వెబ్ సైట్‌లో ఏవిధంగా నమోదు చేయాలో వివరించారు. సర్వేలో వి ఆర్ ఓలు చేయవలసి పనులను,సర్వే విధానాన్ని తెలియజేసారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ పి ఓ డా. వేంకటేశ్వర్ సలిజామల, ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.