మహిళా అధికారులను ఆదర్శంగా తీసుకోవాలి..


Ens Balu
3
Kakinada
2021-03-08 17:09:39

తూర్పుగోదావరి  జిల్లాను అన్ని రంగ్గాలలో ప్రగతిపథంలో నడిపించేందుకు  కృషి చేస్తున్న జిల్లా స్థాయి మహిళ అధికారులను ఆదర్శంగా తిసుకుని  జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినిలకు సూచించారు.  సోమవారం కాకినాడ కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని అకడమిక్ టూర్ లో భాగంగా కాకినాడ విచ్చేసిన ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులతో నిర్వహించిన కార్యక్రమంలో  కలెక్టర్ డి మురళీధర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల పిల్లలకు చదువు పై సరైన అవగాహన లేక చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం,ఏదో ఒక చిన్నపాటి వృత్తికే పరిమితం అవుతున్నారు. ఈ అకడమిక్ టూర్ లో భాగంగా 9,10 తరగతులకు చెందిన 54 మంద విద్యార్థినిలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఇతర ప్రాంతాలను  చూపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనప్పటికీ దానితోపాటు ఇంకా ఉత్తమమైన వృత్తులు చాలా ఉన్నాయన్నారు.తాను విధుల్లో భాగంగా  రంపచోడవరం ఇతర ఏజెన్సీ ప్రాంతాల పర్యటనలో భాగంగా వివిధ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారి ఆలోచనలు  చాలా చిన్నవాటికె పరిమితమవడం గమనించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అత్యధిక శాతం మహిళలే జిల్లాస్థాయి అధికారులుగా ఉత్తమంగా రాణిస్తున్నారని అటువంటివారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని విద్యార్థినిలకు కలెక్టర్ సూచించారు. అకడమిక్ టూర్ లో భాగంగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి,కలెక్టరేట్ లో  వివిధ విభాగాలు, అధికారుల  కార్యాలయాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని రంపచోడవరం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె శ్రావణి తెలిపింది. తొలుత మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినిలు,కలెక్టరేట్ సిబ్బందితో కలిసి కలెక్టర్ కేకును కట్ చేశారు. అనంతరం ఏపీ రైఫిల్ షూటింగ్ ఓపెన్ కాంపిటీషన్ లో జూనియర్ ,యూత్ విభాగాలలో రెండు కాంస్య పతకాలు గెలిచిన లోకజ్ఞను కలెక్టర్ అభినందించారు.  ఈ సమావేశంలో డీఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ  ఎం సరస్వతి, మెప్మా పీడీ కెశ్రీరమణి, ఎడిసి సిహెచ్ నరసింహారావు,కలెక్టరేట్ మహిళల సిబ్బంది పాల్గొన్నారు.