అప్రమత్తంగా విధులు నిర్వహించాలి..


Ens Balu
4
Vijayawada
2021-03-08 17:36:11

 పురపాలక సంఘాలకు జరిగే ఓట్ల లెక్కింపులో సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా విధులను నిర్వహించాలని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు. విజయవాడలోని  ఐ వి ప్యాలస్ లో సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు పై సూపర్వైజర్స్ ను నిర్వహించినా శిక్షణా కార్యక్రమంలో     కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, పురపాలక సంఘాలకు ఈ నెల10న జరిగే పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు 14 వ తేదీ ఆదివారం ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ చాలా కీలకం అన్నారు. కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  పంచాయతీ ఎన్నికలకు, పురపాలక సంఘాల ఎన్నికల లో గెలుపు ఓటములకు చాలా తక్కువ వత్యాసం ఉండే అవకాశం ఉన్నందున విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ తేదీకి, కౌంటింగ్ తేదీకి మధ్య 3 రోజుల సమయం ఉన్నందున అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేసుకోవాలని , జిల్లాలో పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశామని ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం లయోలా కాలేజీ విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు.               దాదాపు ఓట్ల లెక్కింపు మధ్యాన్నం సమయానికి పూర్తి అవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో వ్యాలీడ్, ఇన్ వ్యాలీడ్ ఓట్ల లెక్కింపు చాలా కీలకం కానున్నాయన్నారు.  జిల్లా జాయింట్  కలెక్టర్(సంక్షేమం), మాస్టర్ ఆఫ్ ట్రైనర్ కె. మోహన్ కుమార్ మాట్లాడుతూ, ఈ శిక్షణా తరగతులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా పురపాలక సంఘం పరిధిలో ఓట్లకు అనుగుణంగా టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.  జిల్లా  కలెక్టర్ సారద్యంలో అధికారుల స్వచ్చంద బాగస్వాంతో  పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా నిర్వహించ గలిగామన్నారు. అదే స్ఫూర్తితో, పురపాలక  ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించకుందామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సూపర్వైసర్స్ కు సందేహలకు జేసి నివృత్తి చేశారు.