మహిళా సంఘాలకు నాలుగు బాధ్యతలు..
Ens Balu
1
Vizianagaram
2021-03-08 18:45:21
విజయనగరం జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలు సమాఖ్యంగా కృషి చేయాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పిలుపునిచ్చారు. మార్పు తీసుకొచ్చేందుకు ఓ నాలుగు బాధ్యతలు చేపట్టాలని.. ప్రత్యేక తీర్మాణాల ద్వారా వాటిని అమలు చేయాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డెంకాడ ఇందిరా స్వయం సహాయక సంఘ సభ్యులను సత్కరించిన సందర్భంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఇందిరా గ్రూపు ప్రెసిడెంట్ చిన్నాలు, సెక్రటీరీ ఆదిలక్ష్మి నాయకత్వం, సభ్యులు చూపిన చొరవ ప్రోత్సహించతగ్గ విధంగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రగతి ఇంతిటితో ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని మార్పులకు నాంది పలకాలన్నారు.
మరిన్ని అభివృద్ధి ఫలాలు చూసేందుకు ముఖ్యంగా...
1. చదువు లేని గ్రామం ఉండకూడదు.
2. పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
3. చెరువులను సంరక్షించుకోవాలి.
4. స్వచ్ఛమైన గాలి, నీరు అందించేందుకు.. మొక్కలు నాటాలి అనే నాలుగు తీర్మాణాలు చేసుకొని ప్రతి సంఘం ముందుకు సాగాలని, జిల్లాను ప్రగతి పథంలో నడపాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.