10న మున్సిపాల్టీల్లో స్థానికంగా సెలవు..
Ens Balu
2
విజయనగరం
2021-03-09 10:55:37
విజయనగరం జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్న మున్సిపల్ ప్రాంతాల్లో స్థానికంగా సెలవును ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాలను జారీ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయితీల్లో దుఖానాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు కూడా మున్సిపల్ ప్రాంతాల్లో సెలవు వర్తిస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేసేందుకు, ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు వీలుగా ఈ నెల 9,10వ తేదీల్లో సెలవు ప్రకటించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు జరిగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ నెల 14న సెలవు ప్రకటిస్తూ, జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు.