ఆరోగ్యభారత్ లో భాగస్వాములు కావాలి..


Ens Balu
1
Srikakulam
2021-03-11 16:19:49

ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా ముందుకురావాలని శ్రీకాకుళం జిల్లా నెహ్రు యువక కేంద్రం సమన్వయ అధికారి డి.శ్రీనివాసరావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ  కళాశాల వద్ద నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 ఏళ్ల జయంతి ఉత్సవాల సందర్భంగా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 60 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర యువజన మంత్రిత్వశాఖ వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఈ ఫిట్ ఇండియా అవగాహన కార్యక్రమాలను  చేపడతున్నామని ఆయన వెల్లడించారు. వచ్చే నెల 20 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగంగా  అన్ని వర్గాల ప్రజలకు నడక పోటీలు,యోగా, సైకిల్ ర్యాలీ లు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి. ఇందిరా ప్రసాద్,కూన వెంకట రమణ మూర్తి,గురు ఆనంద రావు,ఎం.మల్లిబాబు,జర్నలిస్టుల ఐక్యవేదిక కన్వీనర్ శాసపు జోగి నాయుడు తదితరులు పాల్గొన్నారు.