విశాఖలో మొదలైన ఎగ్జిట్ పోల్స్ పందాలు..


Ens Balu
1
Visakhapatnam
2021-03-11 18:59:26

ఆంధ్రప్రదేశ్ లో సుమారు 11 సంవత్సరాల తరువాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై హాట్ హాట్ గా ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలు వెలువడుతున్నాయి. అదే స్థాయిలో నేతలు కూడా గట్టిగానే పందాలు కడుతున్నారు. దానికి కారణం ఒక్కటే విశాఖలోని స్టీల్ ప్లాంట్ దేశంలోనే ఒక సూపర్ ఐకాన్ గా ఇప్పటి వరకూ వెలుగొందుతూ వుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 34 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నామని ప్రకటించడం, అందులో ముందుగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించడంతో ఈ ఎగ్జిట్ పోల్స్ కి  మరింత ఊతం చేకూరింది. దానికితోడు తెలుగు దేశం పార్టీ కూడా ఈసారి ఎన్నికలను చాలా చోట్ల అభ్యర్ధులను బరిలో నిలబెట్టి కాస్త ప్రతిష్గాత్మకంగానే తీసుకుంది. అధికార పార్టీ వైఎస్సార్సీపీ చెప్పనక్కర్లేదు. గద పదేళ్ల నుంచి పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న చాలా మందికి ఈ సారి అన్ని మున్సిపాలిటీల పరిధిలో కార్పోరేటర్ అభ్యర్ధులుగా అవకాశం కల్పించి బరిలోకి దించింది. హోరా హోరీ ప్రచారం అనంతరం మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా జరిగిపోయాయి. ఇక బరిలో వున్న అభ్యర్ధులపై అదే స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో చాలా మంది అభ్యర్ధులు కూడా అభ్యర్ధుల గెలుపు ఓటములపై భారీగానే పందాలు కాసినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మభ్య పెట్టడంతోపాటు, విశాఖ సెంటిమెంటుపై రాజకీయమనే ఆయింటుమెంటు పూశారనే కోణంలో సోషల్ మీడియాలో గట్టిగానే వార్ జరిగింది. ఈ క్రమంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ద్రుష్టి మొత్తం విశాఖపైనే పడింది. పార్టీలకు చెందిన పెద్ద ముఖ్య నేతలు విశాఖలో తమ ప్రచారాన్ని చేపట్టారు. అధికారపార్టీకి సైతం రాష్ట్రంలో ఉన్న చాలా సామాజిక మంత్రులు కూడా చేరుకొని చాలా పెద్దసంఖ్యలోనే ప్రచారం నిర్వహించి ఎన్నికలు జరిపించారు. బరిలో వున్న అభ్యర్ధులు కంటే ఈ సారి వారి తరపున ప్రచారం చేయడానికి మహా మహులంతా విశాఖ రావడంతో ఎగ్జిపోల్స్ కి మరింత ఊతం ఏర్పడి 60-40, 50-50, 70-30, 40-60 రేషియోలో పందాలు కాస్తున్నట్టు జోరుగానే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటించిన తరుణంలో ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఇన్చార్జి మంత్రులు, మంత్రులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు ఆఫ్ ది రికార్డ్ రెఫరెండంగా పెట్టారని సమాచారం. ఈ క్రమంలో పందాలకు పోటీ పెరిగి భారీస్థాయిలోనే బెట్టింగులు కట్టారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇచ్చిన టార్గెట్లును అధిగమించకపోతే వచ్చే ఎన్నికల్లో చాలా మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు,  టిక్కెట్లు కూడా దక్కవనే కోణంలో అసత్యప్రచారాలకు కొన్ని ప్రాంతాల్లో తెరతీయడం చర్చనీయాంశం అవుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్ కి అనుగుణంగా ఫలితాలు వస్తే పరిస్థితి ఏంటనే దానిపై కూడా గట్టిగానే వాదనలు నడుస్తున్నాయని చెబుతున్నారు. అసత్య ప్రచారాలు, చర్చావేదికలు, గూఢచర్య లెక్కింపులు, సామాజిక ఓటు బ్యాంకు, ఇలా అన్నికోణాల్లోనూ లెక్కలు వేసినా అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయనేది ప్రస్తుతం టాక్. ఈ టాక్ రేపటి నుంచి ఎలాంటి మలుపులు తిరిగి ఏ స్థాయి ప్రచారానికి తెరలేపుందనేది అందరిలోనూ ఉత్కంఠను కలిగిస్తోంది..!