పర్యాటక ప్రాంతంగా తాండవ జలాశయం..కలెక్టర్


Ens Balu
2
Tandava River
2020-08-20 19:38:05

విశాఖజిల్లా నాతవరం మండలంలోని  తాండవ జలాశయాన్ని  పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. గురువారం ఆయన నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి తాండవ జలాశయం సందర్శించారు. కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, జలాశయ ప్రాంతం అభివృద్ధి పై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారితో చర్చిస్తామన్నారు.  అంతకు  ముందు నాతవరంలో సచివాలయ భవనాల  రైతు భరోసా కేంద్రం నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలు జాప్యంపై అధికారులను ప్రశ్నించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తాండవ జలాశయం    ప్రాంతంలో బోట్ షికార్ ఏర్పాటుకు అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. దేవుని దయతో జలాశయం నిండి ఉందని ఈ సంవత్సరం పంటలు 15 శాతం అధిక దిగుబడి  ఎక్కువ రాగలదని అంచనా వేశారు. మాధవ్ నగరానికి చెందిన ఆయకట్టు దారులు తమ గ్రామం నిర్వాసితులకు ఇచ్చిన పట్టాలు ఆధారంగా  పాస్ పుస్తకాలు అందించి బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలాశయం డి.ఈ. రాజేంద్ర కుమార్, పి ఆర్ డి ఈ ప్రసాద్ రావు, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.