ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే చోట 144 సెక్షన్ అమలు..
Ens Balu
2
Kakinada
2021-03-12 13:59:03
తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టనట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల వృత్త పరిధిలో ఉదయం 7 గం.ల నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకూ సిఆర్పిసి సెక్షన్-144 అమలులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే ఈ ఎన్నికల కౌంటింగ్ జరిగే కాకినాడ జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ 200 మీటర్ల వృత్త పరిధిలో సిఆర్పిసి సెక్షన్-144 అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సెక్షన్-114 అమలు దృష్ట్యా ఆయా తేదీలలో నిర్థేశించిన సమయాల్లో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎటువంటి సమావేశాలు, ఊరేగింపులు, 4గురు అంతకంటే ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు గుమిగూడడం, ఆయుధాలతో కానీ, ఆయుధాలు లేకుండా గానీ సంచరించడం నిషేధించినట్టు కలెక్టర్ వివరించారు.