ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
3
Vijayawada
2021-03-12 16:50:21

క్రిష్ణాజిల్లాలో ఈనెల 14న జిల్లాలో జరగనున్న ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎ న్నికల అధికారి కె. విజయానంద్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ క్యాంపు కార్యాలయం నుంచి, సిపి కార్యాలయం నుండి సిపి బత్తిన శ్రీనివాసులు, మచిలీపట్నం నుండి యస్‌పి విజయకుమార్ , కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ ఆదివారం నిర్వహించే ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎ న్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో 50 ప్రాంతాలలో 51 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలో 6,424 మంది ఉపాధ్యాయ యంయల్‌సి ఎ న్నికలలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటుహక్కు కలిగి ఉన్నారన్నారు. వారిలో 3,619 మంది పురుషులు, 2,804 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఓటుహక్కు కలిగి ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 ఫ్లయ్యింగ్ స్క్వాడ్స్, 34 స్టాటిస్టికల్ సర్వైయల్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆరు హైపర్ సెన్సిటివ్, 15 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, రాష్ట్ర ఎ న్నికల కమిషన్ ఆదేశాల మేరకు 26 పోలింగ్ స్టేషన్ల పరిధిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 25 కేంద్రాలలో వీడియో కవరేజీ కూడా ఏర్పాటు చేశామన్నారు. రెండు దశల్లో ఎ న్నికల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల ఎ డమచేతి మధ్యవ్రేలిపై ఇంకుముద్ర వేయడం జరుగుతుందని, ఈవిషయమై సిబ్బందికి తగిన సూచనలు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 63 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం ఉండగా 142 బాక్స్‌లు సిద్ధంగా ఉంచామన్నారు. 65 మంది పిఓలు, 65 మంది ఏపిఓలు, 118 ఓపిఓలు, 70 మంది మైక్రో అబ్జర్వర్స్‌ను నియమించడం జరిగిందని కలెక్టరు వివరించారు. ఎ న్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా 53 బృందాలు ద్వారా పరిశీలన చేయడం జరుగుతుందన్నారు.