డీసీసీబీని మరింత అభివ్రుద్ధి చేసుకోవాలి..
Ens Balu
1
Vizianagaram
2021-03-12 17:56:28
విజయనగరం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకును మరింత చేరువగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలని జెసి, పర్శన్ ఇన్చార్జి డిసిసిబి కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో డిడిసిబి భవిష్యత్తు కార్యాచరణపై జేసీ సమీక్ష నిర్వహించారు. డీసీసీబీ పర్సన్ ఇన్-ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక అంశాలు చర్చకు వచ్చాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి పలు అంశాలపై మార్గనిర్దేశకాలు చేశారు. జిల్లాలో డీసీసీబీ సేవలు మరింత ఉన్నతంగా అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ ఈ సందర్భంగా సూచించారు. డీసీసీబీ అధికారులు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.