ఆక్వాకల్చర్ కోసం మండల కమిటీలు..
Ens Balu
6
Anantapur
2021-03-12 17:58:23
అనంతపురం జిల్లాలో అప్సడ యాక్ట్ కింద నూతనంగా ఆక్వాకల్చర్ పాండ్స్ ఏర్పాటు కోసం మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మీనీ కాన్ఫరెన్స్ హాల్లో అప్సడ యాక్ట్, ప్రధాన మంత్రి మత్స్యసాగు యోజన తదితర పథకాలపై ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ డిస్టిక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అప్సడ యాక్ట్ అమలు కోసం మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆక్వా కల్చర్ కింద వంద ఎకరాల్లో సాగు జరుగుతుండగా, ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చిన చేపల గుంతలు (ఆక్వాకల్చర్ పాండ్స్) కు సంబంధించి ఎండార్స్మెంట్ చేయాల్సి ఉండగా, అప్సడ యాక్ట్ లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. నూతనంగా ఆక్వాకల్చర్ పాండ్స్ ఏర్పాటు చేయనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రధాన మంత్రి మత్స్యసాగు యోజన కింద 2021-2022 సంవత్సరానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అలాగే 2020-21లో థిలాపియా బ్రూడ్ బ్యాంక్ ను పిఎబిఆర్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రస్థాయి కమిటీకి వివరాలు పంపించేందుకు డిస్టిక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ డిడి శ్యామలమ్మ, సిపిఓ ప్రేమచంద్ర, డి ఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభ స్వరూపరాణి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, మత్స్యశాఖ ఎఫ్ డి వో ఆసిఫ్, వివిధ శాఖల అధికారులు, మస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.