కౌంటింగ్ కు పక్కగా ఏర్పాట్లు చేయాలి..
Ens Balu
1
Kakinada
2021-03-12 18:02:21
తూర్పుగోదావరి జిల్లాలో ఏడు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14వ తేదీన జరిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి.. మునిసిపల్ కమిషనర్లకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వర్చువల్ విధానంలో మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైనన్ని కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటుచేసి, వీలైనంత త్వరగా కౌంటింగ్ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని, జనరేటర్/ఇన్వర్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందిని పూర్తిస్థాయి శిక్షణతో సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కొత్త పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు మౌలిక వసతుల అభివృద్ధి పరంగా పెండింగ్ పనులను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వరరావు, ఇతర మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.