మూమెంట్ రిజిస్టర్ రాయకపోతే ఇంటికే..
Ens Balu
1
Vizianagaram
2021-03-12 18:06:30
విజయనగరం పట్టణంలోని పలు సచివాలయాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని కొత్తఅగ్రహారం ప్రాంతంలో 24,28,29 సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఆయన హాజరు పట్టీని, మూవ్‌మెంట్ రిజిష్టర్‌ను పరిశీలించారు. గైర్హాజరైన సిబ్బంది గురించి ఆరా తీశారు. వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరికి హాజరుపట్టీపై ఆబ్‌సెంట్ నమోదు చేశారు. ఈ సేవ పెండింగ్ దరఖాస్తులపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ, బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మూవ్‌మెంట్ రిజిష్టర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు సౌకర్యకరంగా బోర్డులను ఏర్పాటు చేయాలని 28వ నెంబరు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు, అర్జీలపై తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రతీ సచివాలయ ప్రాంగణంలో మొక్కలను నాటాలన్నారు. సిబ్బంది నిబద్దతతో పనిచేయాలని, ప్రజలకు సక్రమంగా సేవలందించాలని కోరారు.