సచివాలయాల నిర్మాణాలు వేగవంతం కావాలి..


Ens Balu
2
Kakinada
2021-03-12 19:47:48

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్, మిల్క్ బల్క్ సెంటర్లభవన నిర్మాణ పనులు వేగవంతం చేసి, వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మిస్తున్న గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్ లు, మిల్క్ బల్క్ సెంటర్ల పనుల పురోగతిపై పంచాయతీరాజ్ ఇంజనీర్లు,ఈఈ,డీఈఈలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 381 గ్రామ సచివాలయాలు, 74 రైతు భరోసా కేంద్రాలు, 60 ఆరోగ్య క్లినిక్ లు పూర్తి అయినట్లు ఆయన తెలిపారు..పనులు పూర్తి అయిన వాటికి బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.వివిధ నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్ భవనాలు తప్పనిసరిగా మార్చి 31 నాటికి పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన భవనాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జేసి (డబ్ల్యూ) జి.రాజకుమారి, పంచాయతీ రాజ్ సూపరిండిడెంట్ ఇంజనీర్ ఎం నాగరాజు ,ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.