వాతావరణానికి అనుగుణంగా కార్యాచరణ..


Ens Balu
3
Kakinada
2021-03-12 19:55:03

వ్యవసాయ అనుబంధ రంగాలలో వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉపయోగపడే  పలు రకాలైన ప్రాజెక్టులను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా.జి లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్ షాప్ కు జేసి లక్ష్మీ శ , వాతావరణ నిపుణులు డా.టీ రవిశంకర్,జాతీయ జలశాస్త్ర నిపుణులు డా వై ఆర్ సత్యాజిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ నాబార్డు ద్వారా నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ ను వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ శాఖల లో వాతావరణ మార్పులకు అనుగుణంగా పలు రకాలైన ప్రాజెక్టును సిద్ధం చేసి నాబార్డు కు పంపించాలని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఆయా అంశాలపై నిపుణులైన శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని జేసి తెలిపారు. జిల్లాలో వాతావరణ మార్పులు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు సంబంధించి చేపట్టవలసిన నూతన ప్రాజెక్టుల అవకాశాలు, ఉపయోగాల గురించి వాతావరణ నిపుణులు డా.టీ రవిశంకర్,జలశాస్త్ర నిపుణుడు డా.వై ఆర్ సత్యాజిరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. కృష్ణాజిల్లా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఎం రామసుబ్రహ్మణ్యం ఆక్వా, మడ అడవుల్లో చేపల పెంపకం అభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణంగా ద్వీపాలను (ఐలాండ్స్) కాపాడుకొనె టెక్నాలజీని, తన పరిశోధన అనుభవాలు ఇతర అంశాలను ఈ సందర్భంగా జిల్లా అధికారులతో చర్చించారు. వాతావరణ మార్పులకు సంబంధించి వివిధ రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థల ద్వారా చేపట్టగలిగే పలు రకాలైన ప్రాజెక్టుల మార్గదర్శకాలను నాబార్డు డీడీఎం వై.సోమినాయుడు అధికారులకు వివరించారు.   ఈ వర్క్ షాప్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ జేడి డా ఎన్ టి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ డీడీ విటి రామారావు, హార్టికల్చర్ డీడీ రామ్మోహన్ రావు,సీపీఓ బాలాజీ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.