సంక్షేమ కార్యక్రమాలతో రైతుల ఆత్మగౌరవం పెరిగింది..


Ens Balu
4
Anandapuram
2020-08-21 19:41:47

వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో వర్షాలు బాగా కురుసి, పంటలు బాగా పండుతాయని పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు  పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతి రైతుకు ఆత్మ గౌరవం పెరిగిందన్నారు.  శుక్రవారం ఆయన భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలం పాలవలస, బోని గ్రామాలలో , పద్మనాభం మండలం గంధవరం, భాందేవపురం, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలకు  శంకుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి అందించారని ఈ క్రాప్ ద్వారా పంటల బీమా పథకం చేపట్టి రైతులందరికీ పూర్తి భరోసా కల్పించారన్నారు. అలాగే రేపు జరిగే వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని గట్టెక్కించాలని యధావిధిగా అందరం పనిచేసుకుని సంతోషంగా ఉండాలని వినాయకుడిని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.