సీఎం వైఎస్ జగన్ పాలనకు ఈ ఫలితాలే నిదర్శంనం..


Ens Balu
2
Vizianagaram
2021-03-14 18:21:35

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నకల ఫలితాలు 100% సాధించడానికి సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలనకు నిదర్శనమని  పట్టణ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో అత్యధిక స్థానాలను గెలుచుకుందని అన్నారు. జగనన్న ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని ప్రజా సంక్షేమ పాలన అందిస్తుందనే దానికి ఈ ఫలితాలే ఒక నిదర్శనమన్నారు. ఈఎన్నికల్లో కష్టపడిన ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్తకు, నాయకుడిని ఆయన అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఇంతటి ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ  మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్న మంత్రి 22 నెలల సంక్షేమ సీఎం పాలనకు ప్రజలు ఘన విజయం అందించారన్నారు. పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీ, నిబద్ధతకు ప్రజలెప్పుడూ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీనే నమ్మారని, ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నామని, ప్రజలపై తనకు నమ్మకం ఉందని జగన్ చెప్పారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ప్రజలు తమవైపే ఉన్నారని సీఎం చెప్పారని మంత్రి వ్యాఖ్యానించారు.  మాయ మాటలు, మోసం చేసే వ్యక్తికి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అమరావతి, విశాఖ ఉక్కు అంటూ బాబు రాజకీయం చేయబోయాడని అందుకే ప్రజలు ఆయన ఆలోచనకు బుద్ధి చెప్పారని  స్పష్టం చేశారు. తండ్రీకొడుకులు ఎలా మాట్లాడారో రాష్ట్రమంతా చూశారని  బొత్స గుర్తుచేశారు.