వినియోగదారుల్లో చైతన్యం రావాలి..
Ens Balu
2
శ్రీకాకుళం
2021-03-15 17:24:03
వినియోగదారుల్లో చైతన్యం వచ్చినప్పుడే నాణ్యమైన వస్తువుల అమ్మకాల సంఖ్య పెరుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆస్రా సంస్థ, స్టార్ వాకర్స్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఆర్‌ఒ ఎల్.రమేష్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే నాణ్యమైన వస్తువు కొనుగోలు చేసుకోవచ్చునని, నాసిరకం వస్తువులు అమ్మకాలు జరిగినా దానిపై ఫోరంను ఆశ్రయించవచ్చునన్నారు. సిటిజన్‌ఫోరం అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వై.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లనే వినియోగదారులు మోనపోతున్నారని, చట్టాలు గురించి తెలునుకున్నప్పుడు అందరికీ మేలు జరుగుతుందన్నారు. వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ జిలా, రాష్ట్ర జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరమ్స్ ఉన్నాయని, ఇవి న్యాయవ్యవస్థ అధీనంలోనే పనిచేస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. ఏపిడబ్బుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, (ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ ఎటువంటి రుసుం చెల్లించకుండా, న్యాయవాదితో ప్రమేయం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకొనే అవకాశం ఉందని, వీటిని సద్వినియోగం చేసుకొనేవారి సంఖ్య పెరిగినప్పుడు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎలక్ష్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై పలు విద్యా సంస్థల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఆస్రా రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ గంజి ఎజ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించేందుకు చైతన్యరథాలు జిల్లాకు రానున్నాయని, న్యాయవాదులు, విద్యావంతులు అవగాహనా సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలన్నారు. వాకర్స్‌క్లబ్ అధ్యక్షుడు చలపాక సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఎస్‌డిఒ శ్రీనివాస్‌కుమార్, జిల్లా బిసి సంఘాల అధ్యక్షుడు పి.చంద్రపతిరావు, అమిరుల్తాబేగ్, వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ కూన వెంకటరమణ, బి.వి.రవిశంకర్, ఆనందరావు, జ్యోతిర్మయి తదితరులు ప్రసంగించారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పిస్తున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆస్రా, స్టార్ వాకర్స్‌క్లబ్ ప్రతినిధులు సత్కరించారు.