విజయనగరం స్పందనకు 65 అర్జీలు..
Ens Balu
2
Vizianagaram
2021-03-15 20:15:52
ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 65 వినతులు అందాయి. వీటి లో ఎక్కువగా భూ సమస్యలు, వికలాంగ ధ్రువ పత్రాల కోసం, పించన్ల మంజూరు కోరుతూ వచ్చాయి. ఈ స్పందన వినతులను జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్, సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, విపత్తుల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి స్వీకరించారు. ఈ దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు పంపుతూ త్వరగా పరిష్కరం అయ్యేలా చూడాలని అన్నారు. స్పందన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో పలు ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల పై సమీక్షించారు. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజూరైన స్థలాలను వంటనే పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. 90 రోజుల్లో పరిష్కరించవలసిన ఇళ్ళ స్థలాల దరఖాస్తులను కూడా త్వరగా పూర్తి చెయ్యాలన్నారు. నాడు –నేడు పనులను, కన్వర్జెన్స్ పనులను త్వరగా పూర్తిచేసి పురోగతిలో ఉండేలా చూడాలన్నారు. వై.ఎస్.ఆర్ బీమా, తోడు,చేయూత, ఆసరా పధకాల లో అబివృది కనపడలన్నారు. ఆయా అధికారులంత ఇక పై ఈ పధకాల పైనే దృష్టి సారించాలన్నారు. డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా మంజూరైన ఉద్యోగుల హెల్త్ కార్డులను జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్ సోమవారం ప్రారంభించారు. జిల్లాకు సంబంధించి 34 శాఖలకు చెందిన ఉద్యోగులకు 47,676 కార్డులు మంజురైనాయని వీటిని వెంటనే ఆయా శాఖల ఉద్యోగులకు అందజేయాలని కలెక్టర్ ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయధికారి డా. అప్పల రాజుకు సూచించారు. కలెక్టర్ సూచనల మేరకు వెంటనే అన్ని శాఖల ఉద్యోగులకు కార్డులను పంపిణీ చేసారు.