ఆర్.డి.ఓ రమణ సేవలు స్ఫూర్తిదాయకం..


Ens Balu
2
Srikakulam
2020-08-21 20:07:37

శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన ఎం.వి.రమణ సేవలు స్ఫూర్తిదాయకమని రెవిన్యూ అధికారులు, సిబ్బంది పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికా రిగా బదిలీ అయిన రమణ గురు వారం బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. బదిలీపై వెళుతున్న రమణను శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ అధికారులు, కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆర్.డి.ఓగా మంచి సేవలు అందించారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో మంచి మార్గదర్శకత్వం వహించారని, సూచనలు సలహా లతో విధులను విజయవంతంగా నిర్వహించుటకు తోడ్పడ్డాయని అన్నారు. కోవిడ్ ప్రారంభ దశ నుండి రేయింబవళ్ళు విధులు నిర్వహించి క్వారంటీన్ కేంద్రాల ఏర్పాటు, రవాణా ఏర్పాటులో విశేషమైన కృషి చేసారని ప్రశంసించారు. చివరకు అనారోగ్యం భారీన పడినప్పటికి త్వరగా కోలుకుని ఉద్యోగ నిర్వహణలో వెంటనే చేరడం ఆదర్శప్రా యమ న్నారు.  బదిలీపై వెళుతున్న ఎం.వి.రమణ మాట్లాడుతూ శ్రీకాకుళంలో పనిచేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. శ్రీకాకుళం మరుపురాని అనుభూతిని కలిగించిందని అన్నారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ తో సహా అధికారులు, సిబ్బంది అందరూ చక్కటి సహకారం అందించడం వలన విధులు నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, అటువంటి సమయంలో వారికి సేవలు అందించడం ఉద్యోగ నిర్వహణలో సంతృప్తికరమైనదని అన్నారు. జిల్లా కలెక్టర్ నివాస్ మంచి వసతులు కల్పించారని, వాటి పర్యవేక్షణలో భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిందని అన్నారు.      ఈ కార్యక్రమంలో తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.