రద్దుచేసిన రైళ్లను తక్షణమే నడపండి..
Ens Balu
2
Machilipatnam
2021-03-15 20:32:51
మచిలీపట్నం-విజయవాడ మచిలీపట్నం-గుడివాడ,మచిలీపట్నం-విశాఖపట్నం ల మధ్య నిలిపివేసిన గత సంవత్సరంగా నిలిపివేసిన పాసింజర్ రైళ్లను వెంటనే పునరిద్దరించి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కన్సల్టెటివ్ సభ్యుడు,సీనియర్ పాత్రికేయుడు చలాది పూర్ణచంద్ర రావు రైల్వే శాఖ ఉన్నత అధికారులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దానిని సోమవారం మీడియాకి విడుదల చేశారు. ఈ పాసింజర్ రైళ్ల ద్వారా పేద ప్రయాణీకులు,ఉద్యోగులు,విద్యార్థులు,ఇతర చిరు వ్యాపారులకు ఎంతో సౌక్యర్యంగా ఉండేవని పేర్కొన్నారు. నిలిపివేసిన తరువాత నేటికీ వాటిని పునరుద్దరించలేదన్నారు. ఒకప్రక్క ఆర్టీసీ బస్సులు, దూర ప్రయాణీకుల రైళ్లు ఇతర ప్రైవేట్ రవాణా వాహనాలు యధా విధిగా నడుస్తుండగా ఇంకా పాసింజర్ రైళ్లు నడపకపోవటంతో ప్రయాణ సౌకర్యం లేకపోవడం వలన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు,చిరు వ్యాపారులు,ఉద్యోగులు పేద మధ్యతరగతి ప్రయాణీకుల మీద ఆర్థికభారం పడుతున్నదన్నారు. అన్ని రకాల వాహనాలు, స్కూళ్ళు,కార్యాలయములు యధావిధిగా నడుస్తుంటే ఇంకా పాసింజర్ రైళ్లు నడపకపోవటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అలాగే మచిలీపట్నం -తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుని కూడా పునరిద్దరించాలని పూర్ణచంద్ర రావు ఆ ప్రకటనలో అధికారులను కోరారు.