అంతరాత్మే ఇక ప్రధాన ప్రతిపక్షం..
Ens Balu
2
Machilipatnam
2021-03-15 20:39:43
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు అది తప్పా ఒప్పా అని పలుమార్లు యోచిస్తామని తమ అంతరాత్మే ఇక ప్రధాన ప్రతిపక్షమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో విలేకరులతో మంత్రి పేర్ని నాని విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, మీకు ఇక ప్రతిపక్షమే లేకుండా పోయిందని ఒక విలేకరి చమత్కరించగా, ఈ విజయం మా పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని సూచిస్తుందని, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పని చేయడానికి, అన్ని డివిజన్లలో సమస్యల పరిష్కారం పట్ల బాధ్యతను మరింతగా పెంచిందని ఇకపై తమ అంతరాత్మే ప్రతిపక్షమని, పాత్రికేయులు సైతం ఏదైనా వార్త రాసే ముందు అది తప్పా ఒప్పా అని పలుమార్లు ఆలోచించాలని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని సూచించారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంపై మంత్రి పేర్ని నాని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్సార్సీపీ పట్ల రాష్ట్రప్రజలు చూపిన విశేష ఆదరణకు ఇది ఒక కొలబద్దని తెలిపారు ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రిగా జగన్ సుపరిపాలనకు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వానికి ఈ గొప్ప విజయం ప్రజలు ఇచ్చిన అపురూప బహుమతని వినమ్రంగా పేర్కొన్నారు.
రాబోయే రెండేళ్లలో మచిలీపట్నంలో 70 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏప్రిల్ మాసాంతంలో వైద్య కళాశాల శంఖుస్థాపనకు ముఖ్యనంత్రి జగన్మోహనరెడ్డి మచిలీపట్నం రానున్నట్లు తెలిపారు. దీనితో పాటు 100 సీట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు పక్కా భవనం నిర్మిస్తామని చెప్పారు. వచ్చే జూలై మాసం నుండి మచిలీపట్నం నగరపాలకసంస్థ పరిధిలో విద్యుత్ కు అంతరాయం కల్గించకుండా ప్రతిరోజు త్రాగునీరు అందించనున్నట్లు ఇందుకోసం 45 కోట్ల రూ.లు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా అంగీకరించారని ఎన్నికల కోడ్ను ముగిశాక ఆ నిధులు విడుదల అయిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. మచిలీపట్నం జోన్లుగా విభజించి ప్రతిరోజు త్రాగునీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.కుల,మత,పార్టీలకతీతంగా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వం ఇదేనన్నారు.