మంచినీటి ఎద్దడి నివారణకు కార్యచరణ ..
Ens Balu
2
Machilipatnam
2021-03-15 20:51:27
వేసవిలో గ్రామంలో త్రాగునీటి సమస్యలు ఏర్పడకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా పంచాయితీ అధికారి పి.సాయిబాబు అన్నారు. సోమవారం జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిపివో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో 981 గ్రామ పంచాయితీలు ఉన్నాయని 455 మంచినీటి చెరువులు ఉన్నాయని వేసవిలో త్రాగునీటి సమస్య ఏర్పడకుండా అవన్ని ముందుగా త్రాగునీటితో నింపాలని ఆయా గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలను ఆదేశించినట్లు తెలిపారు. ఇరిగేషన్ డిపార్టుమెంట్ ప్రకాశం బ్యారేజీ నుండి కెఇబి కెనాల్, బందరు కెనాల్, ఏలూరు కెనాల్, రైవస్ కెనాల్ 4 ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా రబి సీజన్ మరియు త్రాగునీటి అవసరాలకు 3521 క్యూసెక్కుల నీటిని ప్రతి ఏడాది విడుదల చేస్తుంటారని, ఈ విధంగా విడుదల చేసిన వాటర్ తో గ్రామాల్లో చెరువులు నింపాలని త్రాగునీటి పధకాల మోటార్లు రన్నింగ్ కండిషన్‌లో ఉంచాలని, చెరువుల్లో నీటి నిల్వ సామర్ద్యం పెంపునకు పూడికలు తీయించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే నెల 22 వరకు నీటిని విడుదల చేస్తారని అన్నారు. గ్రామాల్లో ఎక్కడైన త్రాగునీటి సమస్య ఏర్పడితే జిల్లా పంచాయితీ అధికారి సెల్ 9849903225 నెంబరుకు ఫోన్ చేయాలని వెంటనే స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తామని డిపివో అన్నారు.